జహీరాబాద్ టౌన్: విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన అవసరమని టాస్క్ ట్రైనర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. టాస్క్ ద్వారా ఇచ్చే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటే మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయన్నారు. అనంతరం కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్, వే ఆఫ్ అండర్‌స్టాండింగ్, లిజినింగ్ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరికుమార్, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్ నర్సింలు అధ్యాపకులు పాల్గొన్నారు.


