ముగిసిన శిక్షణ
మునిపల్లి(అందోల్): విధులు, బాధ్యతలు, హక్కులపై వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆదివారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో ఈ నెల 4 నుంచి ఆయా గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ అంజయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సకాలంలో పన్నులు చెల్లించాలి
సంగారెడ్డి: పట్టణంలోని కాలనీలు వాణిజ్యసముదాయాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సకాలంలో పనులు చెల్లించి పట్టణాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అలాగే, రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలిగే వాణిజ్యసముదాయలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ సజీద్ అలీ, బిల్ కలెక్టర్లు ఉన్నారు.
విద్యార్థులకు టీషర్టుల పంపిణీ
వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని వీరన్నగూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందమైన పూలతో అలంకరించారు. మొదటిరోజు జరిగిన పూజ ల్లో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు వీరభద్ర స్వా మికి అభిషేకాలు, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన పూజలు భక్తులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శశిధర్ గుప్తా, భక్తులు పాల్గొన్నారు.


