తొలిరోజు 96.90% హాజరు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 96.90% హాజరు

Feb 26 2026 9:15 AM | Updated on Feb 26 2026 9:15 AM

తొలిర

తొలిరోజు 96.90% హాజరు

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

జిల్లాలో 563 మంది స్టూడెంట్స్‌ గైర్హాజరు ఇంటర్‌ అధికారి గోవిందరామ్‌ వెల్లడి

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఇఫ్తార్‌ గురువారం : 6.27

సహర్‌ శుక్రవారం : 5.15

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా తొలిరోజు కావడంతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. గతంలో నిమిషం నిబంధనను సడలించడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చారు. తొలిరోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,179 మంది విద్యార్థులకుగాను 17,616 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో జనరల్‌ విభాగంలో 16,852 మంది విద్యార్థులకుగానూ 16,438 మంది హాజరు కాగా 414 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్‌ విభాగంలో 1,327 మంది విద్యార్థులకు గానూ 1,178 మంది హాజరుకాగా 149 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు. మొత్తం హాజరు 96.90%గా నమోదైంది. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని ఇంటర్‌ అధికారి గోవిందరామ్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు కన్వీనర్‌/డీఐఈఓ రెండు, డీఈసీ సభ్యులు 11 కేంద్రాలను, హెచ్‌పీసీ సభ్యులు నాలుగు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు 11 కేంద్రాలను, సిట్టింగ్‌ స్క్వాడ్లు ఎనిమిది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

పరీక్షా కేంద్రాలను

తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టర్‌ ప్రావీణ్య జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌, షాహిన్‌ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీటీవీ కెమెరాల పనితీరును, పరీక్షల నిర్వహణను, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నపత్రాలను తెరిచారా లేదా అన్నది పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ సంగారెడ్డి ప్రభుత్వ మహిళా జూనియర్‌, సెయింట్‌ ఆంథోని, ఎస్‌.వి జూనియర్‌ కాలేజ్‌లను సందర్శించారు.

బోర్డుపై హాల్‌ టికెట్‌ నంబర్‌

చూసుకుంటున్న విద్యార్థులు

ఇంటర్‌ తొలిరోజు పరీక్ష రాసిన 17,616 మంది విద్యార్థులు

తొలిరోజు 96.90% హాజరు1
1/2

తొలిరోజు 96.90% హాజరు

తొలిరోజు 96.90% హాజరు2
2/2

తొలిరోజు 96.90% హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement