27న నిధి ఆప్‌ కే నిఖత్‌ | - | Sakshi
Sakshi News home page

27న నిధి ఆప్‌ కే నిఖత్‌

Feb 26 2026 9:15 AM | Updated on Feb 26 2026 9:15 AM

27న న

27న నిధి ఆప్‌ కే నిఖత్‌

పటాన్‌చెరుటౌన్‌: భవిష్యనిధి సంస్థ ద్వారా ప్రతీనెల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల్లో భాగంగా నిధి ఆప్‌ కే నిఖత్‌ 2.0 ఈ నెల 27న నిర్వహించనున్నట్లు ప్రాంతీయ కమిషనర్‌ వి శాల్‌ అగర్వాల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు కేంద్రాల్లో మూడు శిబిరాలను ఉదయం 9:30 నుంచి 5:45 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా...పటాన్‌చెరు ఐడీఏ విజయ గ్లో ప్యాక్‌ సిస్టమ్‌లో, అమీన్‌పూర్‌ పరిధిలోని మోల్డ్‌ టెక్‌ ప్యాకేజింగ్‌ లిమిటెడ్‌లో, జహీరాబాద్‌ పరిధిలోని ముగ్ధంపల్లి ముంగి ఇంజనీరింగ్‌లో, రంగారెడ్డి జిల్లా.. బ్లూ వేల్‌ రాయేలాస్‌ డీఎఫ్‌ రోడ్డు, సిద్దిపేట జిల్లా.. కూచారం విలేజ్‌ వండర్‌ ఎలక్ట్రికల్స్‌లో భవిష్యనిధి సమస్యలున్నవారు పైన పేర్కొన్న మూడు కేంద్రాల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

జాబ్‌మేళాకు స్పందన భేష్‌

జహీరాబాద్‌ టౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీడీఓ కార్యా లయంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు మంచి స్పందన లభించింది. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యా రు. డీఆర్‌డీఏ ఏపీఎం విశేశ్వర్‌గౌడ్‌, మహీంద్రా ట్రాక్టర్‌ కర్మాగారం మేనేజర్‌ లక్ష్మినారాయణ ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు తీ సుకున్నారు. 140 అభ్యర్థులు జాబ్‌మేళాలో ఎంపికయ్యారు.

సీఎం కప్‌లో

ప్రణవ్‌కు కాంస్యం

సంగారెడ్డి : ఈ నెల 22, 23 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్‌–2025 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో సంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రణవ్‌కు బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం లభించింది. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ప్రణవ్‌ కోచింగ్‌ లేకుండానే రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పతకం సాధించడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొని మన జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావా లని మండల పరిషత్‌ అభివద్ధి అధికారి శంకర్‌ ఆకాంక్షించారు. ప్రణవ్‌ను చౌటకూరు ఎంపీఓ సువర్ణ, ఏపీవో రామ్మోహన్‌ మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది అభినందించింది.

రాసోల్‌లో నేడు రీసర్వే

అవగాహన సదస్సు

హాజరు కానున్న సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి

కంగ్టి(నారాయణఖేడ్‌): కంగ్టి మండలంలోని రాసోల్‌ గ్రామంలో గురువారం ప్రారంభమయ్యే రీ సర్వే కార్యక్రమానికి ఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి హాజరు కానున్నారు. ఈ మేరకు తహశీల్దార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 866.32 ఎకరా లు కాగా 111 సర్వే నంబర్లున్నాయి. అందులో పట్టా భూమి 614.11 ఎకరాలు, ప్రభుత్వ భూమి 252.21 ఎకరాలు ఉంది. ప్రభుత్వ భూమి 252.21 ఎకరాల్లో 107.19 ఎకరాలు కాకివాగు ప్రాజెక్టులో ముంపునకు గురికాగా, 145.02 ఎకరాలు అసైన్డ్‌ భూమి ఉన్నట్లు రికార్డులున్నాయి. మొత్తం 705 సబ్‌ డివిజన్‌ నంబర్లు సర్వే చేసి రైతుల భూములను నిర్దేశించనున్నట్లు సమాచారం.

27న నిధి ఆప్‌ కే నిఖత్‌1
1/1

27న నిధి ఆప్‌ కే నిఖత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement