దోషులను అరెస్టు చేయండి
నారాయణఖేడ్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మరణానికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు, రజక సంఘం బాధ్యులు డిమాండ్ చేశారు. ఖేడ్‌లో బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి రాజీవ్‌చౌక్ వరకు శ్రీ వెంకటేశ్వర బీసీ సంఘాలతోపాటు, రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకే ర్యాలీ నిర్వహించామన్నారు. నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్ విజయ్ బుజ్జి, నజీబ్, అభిషేక్ షెట్కార్, ఆయా సంఘాల బాధ్యులు సాయిరాం, నర్సింహులు, సీహెచ్ నర్సింహులు, మచ్కూరి అంజయ్య, పాండు రాజుగౌడ్, ఓంప్రకాశ్ పాల్గొన్నారు.
పసికందు మృతికి ఖేడ్‌లో వెల్లువెత్తిన నిరసన


