ఉపాధి కల్పనే ఏటీసీ లక్ష్యం
సంగారెడ్డి జోన్: ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాల మెరుగుదల ఏటీసీ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో శిక్షణ ముగించుకుని బయటకు వెళ్తున్న అభ్యర్థుల కోసం ‘ఆన్ ది జాబ్ ట్రైనింగ్’కార్యక్రమానికి ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ ఎన్.కాంతివెస్లీతోపాటు కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నారు. ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటంతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం కాంతివెస్లీ మాట్లాడుతూ...శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 13 విభిన్న ట్రేడ్స్‌కు చెందిన 279 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు. పరిశ్రమల ప్రతినిధులతో విద్యార్థులు చర్చించారు. పలు పరిశ్రమలు ఎంపిక చేసిన వారికి ఆఫర్ లెటర్లు అంద జేశారు. ఎంపికైన వారికి రూ.10,000 నుంచి రూ.15,500 వరకు స్టైఫండ్‌తోపాటు ఆన్–ది–జాబ్ ట్రైనింగ్ అవకాశాలు కల్పించారు. కార్యక్రమంలో ప్రాంతీయ ఉప డైరెక్టర్ ఎస్.రాజా, ప్రభుత్వ ఐటీఐ సంగారెడ్డి ప్రిన్సిపాల్ డి.తిరుపతిరెడ్డి, ప్రభుత్వ ఐటీఐ పటాన్‌చెరు ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
13% హెచ్‌ఆర్‌ఏ
వర్తింపు చేయాలి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు 13% హెచ్‌ఆర్‌ఏ వర్తింప చేయాలని పీఆర్‌టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు తులసీరాం రాథోడ్ మాట్లాడుతూ...జహీరాబాద్ మున్సిపల్ పరిధి విస్తరించిన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ 11% నుంచి 13% పొందడానికి వీలుకలిగిందన్నారు. పెరిగిన హెచ్‌ఆర్‌ఏ పొందడానికి డిస్టెన్స్ సర్టిఫికెట్ అవసరం ఉందన్నారు. జహీరాబాద్ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల లోపు 32 గ్రామాలున్నాయని, ఆయా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి సర్టిఫికెట్‌లు జారీ చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో డి.శ్రీనివాస్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
నిలువ నీడలేక
రోడ్డు విస్తీర్ణంలో భాగంగా 65వ జాతీయ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చారు. అయితే దిగ్వాల్ గ్రామం గుండా వెళ్లే మార్గంలో కనీసం బస్సు షెల్టర్‌ను కూడా నిర్మించకపోవడంతో బస్సుల కోసం ప్రజలు, విద్యార్థులు నిలబడి ఎండబారిన పడుతూ పడిగాపులు పడుతున్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్డుకు ఇరువైపుల బస్సు షెల్టర్లు నిర్మించాలని కోరుతున్నారు.
– జహీరాబాద్ టౌన్:
కలెక్టర్ ప్రావీణ్య
ఉపాధి కల్పనే ఏటీసీ లక్ష్యం


