మహిళా సాధికారతకే ప్రాధాన్యం
ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి
సంగారెడ్డి: మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జోగిపేట వ్యవసాయ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. చౌటకూర్ మండలంలోని లింగంపల్లిలో ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలతో నిర్మించనున్న డ్వాక్రా భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరతో కలిసి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకుని, నామినెటేడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసిందన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక శ్రద్ధతో అందోలు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించారన్నారు. సర్పంచ్ బేగరి రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, పంచాయతీ కార్యదర్శి చక్రియాల ఆలయ కమిటీ చైర్మన్ బానూరి లక్ష్మణ్, శివంపేట, వెంకటకిష్టాపూర్ సర్పంచ్‌లు కొత్తగడి సంధ్యారాణి మల్లికార్జున్ గౌడ్, బోడపట్ల గణేష్ ముదిరాజ్, ఉప సర్పంచ్ మహేందర్, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి. నాయకులు కలాలి ఈశ్వర్ గౌడ్, సాయాగౌడ్, బచ్చాగౌడ్, వార్డు సభ్యులు దాస్, లావణ్య, సంధ్య, అనిల్, సుకన్య తదితరులు పాల్గొన్నారు.


