మోగనున్న పెళ్లి బాజాలు | - | Sakshi
Sakshi News home page

మోగనున్న పెళ్లి బాజాలు

Feb 19 2026 11:03 AM | Updated on Feb 19 2026 11:03 AM

మోగనున్న పెళ్లి బాజాలు

మోగనున్న పెళ్లి బాజాలు

ఆధునిక సెట్టింగ్‌లు

రేపటి నుంచి మే 13 వరకు

శుభ ముహూర్తాలు

కళకళలాడనున్న కల్యాణ మండపాలు

ఒక్కటి కానున్న జంటలు

ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌ సర్వీసులకు డిమాండ్‌

పెళ్లి సందడి ప్రారంభం

మాఘమాసం వచ్చింది. శుభ కార్యాలకు మంచిరోజులు తెచ్చింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత శుభ ముహూర్తాలు రానున్నాయి. శుక్రవారం నుంచి వివాహ వేడుకలు మొదలు కానున్నాయి. ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌ సర్వీసులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ వేసవిలో పెళ్లిళ్ల సందడి అధికంగా ఉండనుంది. మే వరకు ముహుర్తాలు కొనసాగనున్నాయి.

– సంగారెడ్డిటౌన్‌

మొదలైన షాపింగ్‌ సందడి

పట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్‌ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్‌ ప్రారంభించారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్‌, కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాల్స్‌, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖలు, ఫ్లెక్సీ ప్రింటింగ్‌, ఫొటోగ్రాఫర్లు, టెంట్‌హౌస్‌, వంట మేసీ్త్రలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, బజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ పని మొదలైంది. ఆర్థికంగా స్తోమత ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్‌ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తరగతి వారు కూడా తమస్థాయికి తగ్గట్లు వేడుకలకు సిద్ధమవుతున్నారు.

కల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా అక్కడయితే ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా మండపాలను తీర్చిదిద్దేంగుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

ఫొటోగ్రఫీలో కొత్త పుంతలు

ముఖ్యంగా పెళ్లిళ్లలో ఫొటోగ్రఫీకి అధిక ప్రాధాన్యం ఉంది. ఫొటోలు, వీడియో షూటింగ్‌లకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇటీవల పెళ్లిళ్లలో డ్రోన్‌ కెమెరాలు విరివిగా వాడుతున్నారు. వివిధ కోణాల్లో చిత్రీకరించటంతో డ్రోన్‌లకు మరింత డిమాండ్‌ పెరిగింది. పెళ్లికి ముందే ప్రి వెడ్డింగ్‌ ఘాట్‌లు నిర్వహించడం నయా ట్రెండ్‌గా మారింది.

మంగళవాయిద్యాలకు మంచి గిరాకీ

హిందూ సంప్రదాయంలో మంగళవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధంచేసే సమ యం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పని సరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ. లక్షకుపైగా ఖర్చుచేస్తున్నారు. ఇక విందు భోజనాల సంగతి సరేసరి. ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. ఎంచుకున్న మెనూను బట్టి ప్లేట్‌కు ఇంతని ధర నిర్ణయిస్తారు. పెళ్లిళ్లు చేయించే పురోహితులకు మంచి డిమాండ్‌ పెరిగింది.

4 నెలలపాటు ముహూర్తాలు

ఈ యేడాది ఫిబ్రవరి 20 మొదలుకొని మే 13 వరకు మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

– శిలంకోట ప్రవీణ్‌ శర్మ, పురోహితుడు

ముహూర్తాలు ఇలా..

ఫిబ్రవరి: 20, 22, 25,

26, 27

మార్చి: 5, 6, 8, 12, 14, 15

ఏప్రిల్‌: 1, 2, 3, 4, 8, 11, 12, 29, 30

మే: 1, 3, 6, 8, 9, 10, 13

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement