ప్రతిభా పరీక్షలు పోటీతత్వాన్ని పెంచుతాయి
హుస్నాబాద్: ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో హుస్నాబాద్, అక్కన్నపేట మండల స్థాయి సైన్స్ టాలెంట్ పరీక్షలు బుధవారం హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. అనంతరం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతిభా పోటీలు విద్యార్ధుల పోటీ తత్వాన్ని పెంచుతాయన్నారు. సైన్స్ టాలెంట్ పరీక్ష విద్యార్ధుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పెంచి ఉన్నత చదువులల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి సహకరిస్తాయని తెలిపారు. విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బండారి మనీల, పాఠశాల హెచ్‌ఎం వాసుదేవరెడ్డి, డీఆర్పీ నర్సింహారెడ్డి, చింతకింది శ్రీనివాస్, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి


