తేనెటీగల పెంపకంతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

తేనెటీగల పెంపకంతో ఆదాయం

Feb 19 2026 11:03 AM | Updated on Feb 19 2026 11:03 AM

తేనెటీగల పెంపకంతో ఆదాయం

తేనెటీగల పెంపకంతో ఆదాయం

నారాయణఖేడ్‌: రైతులు తేనెటీగల పెంపకంతో నెలకు రూ. 2 వేల అదనపు ఆదాయం పొందవచ్చని జహీరాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత తెలిపారు. ఖేడ్‌ మున్సిపల్‌ పరిధిలోని చాందఖాన్‌పల్లిలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వర్షాధార పంట అభివృద్ధి పథకంలో భాగంగా తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిక చేసిన 121 మంది రైతులకు ఒకొక్కరికి 18 టమాటా పెట్టెలు, రెండు చొప్పున వర్మీబెడ్స్‌, తేనెటీగల పెట్టెలు, రూ.10 వేల నగదును పంపిణీ చేశారు. తేనెటీగల పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలు, మంచితేనె ఉత్పత్తిని సాధించే విధానాలు, తేనె సేకరణ పద్దతులు తదితర అంశాలపై స్నేహలతతో పాటు ఖేడ్‌ డివిజన్‌ ఏడీఏ నూతన్‌ కుమార్‌, డివిజన్‌ ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి పండరి, విస్తరణ అధికారి విఠల్‌, ఏఓ శంకర్‌, జహీరాబాద్‌ విస్తరణ అధికారి విఠల్‌ సమగ్రంగా వివరిస్తూ అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement