ప్రతిభను వెలికి తీసేందుకే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభను వెలికి తీసేందుకే..

Nov 5 2025 9:13 AM | Updated on Nov 5 2025 9:13 AM

ప్రతి

ప్రతిభను వెలికి తీసేందుకే..

’సాక్షి’ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పెల్‌ బీ పరీక్ష

సిద్దిపేట , చేర్యాలలో పరీక్షలు

సుమారు 427 మంది హాజరు

సిద్దిపేటజోన్‌/చేర్యాల(సిద్దిపేట): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సాక్షి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబిటస్‌, మాడ్యులస్‌ పాఠశాలల్లో నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు ప్రాథమిక, హై స్కూల్‌ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై తమ ప్రతిభాపాటవాలను పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంబిటస్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతి, మాడ్యులస్‌ డీన్‌ అల్లా భక్షు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చేర్యాలలోని స్థానిక వికాస్‌ గ్రామర్‌ స్కూల్‌లో నిర్వహించిన ’స్పెల్‌ బీ’ ఆంగ్లం ప్రాథమిక స్థాయి పరీక్షకు 3, 4వ తరగతి చదువుతున్న 27 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరస్పాండెంట్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

మాడ్యులస్‌ స్కూల్‌లో..

వికాస్‌ గ్రామర్‌ స్కూల్‌లో..

అంబిటస్‌లో సాక్షి స్పెల్‌బీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఇంగ్లిష్‌పై ఆసక్తి పెరిగింది

స్పెల్‌బీ పరీక్ష ద్వారా ఆంగ్లంపై ఆసక్తి పెరిగింది. దీని వల్ల ఆ భాషపై మరింత పట్టు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొత్త కొత్త పదాలు నేర్చుకున్న. ప్రతి ఏడాది ఇలాగే నిర్వహిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.

– సహస్ర, అంబిటస్‌

సులువుగా నేర్చుకోవచ్చు..

ఇంగ్లిష్‌ అంటే భయం ఉండేది. స్పెల్‌బీ ద్వారా సులువుగా మారింది. భయం పోయేందుకు స్పెల్‌బీ ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. పోటీ పరీక్షలు బాగా రాశాను.

– జోషీక్‌, మాడ్యులస్‌

ఎంతో ప్రయోజనం

‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రతిసారి స్పెల్‌బీ పరీక్షలు నిర్వహిస్తాం. ఇది విద్యా ర్థులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మా స్కూల్‌ పిల్లలు పోటీపడి పరీక్షలు రాస్తున్నారు.

– జ్యోతి,

ప్రిన్సిపాల్‌, అంబిటస్‌

గతంలో రాష్ట్ర స్ధాయి వరకు వెళ్లా

సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పెల్‌ బీ’ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. గత సంవత్సరం 3వ తరగతిలో మొదటిసారి రాశాను. అప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాను. ఈసారి రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తెస్తాను.

– గనెబోయిన సాయిభార్గవి, 4వ తరగతి.

జిల్లా స్థాయికి ప్రయత్నిస్తా

సాక్షి ప్రాథమిక స్థాయి స్పెల్‌బీ పరీక్ష మొదటిసారి రాశాను. ఈ అనుభవంతో జిల్లా స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తా. సాక్షి దినపత్రిక నిర్వహిస్తున్న ఈ స్పెల్‌బీ పరీక్ష రాయడం వల్ల పోటీ పరీక్షలంటే భయం పోయింది.

– పెడతల రోహన్‌రెడ్డి, 3వ తరగతి

ప్రతిభను వెలికి తీసేందుకే..1
1/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

ప్రతిభను వెలికి తీసేందుకే..2
2/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

ప్రతిభను వెలికి తీసేందుకే..3
3/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

ప్రతిభను వెలికి తీసేందుకే..4
4/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

ప్రతిభను వెలికి తీసేందుకే..5
5/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

ప్రతిభను వెలికి తీసేందుకే..6
6/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

ప్రతిభను వెలికి తీసేందుకే..7
7/7

ప్రతిభను వెలికి తీసేందుకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement