మమ్ముల్ని వదిలి వెళ్లిపోయావా బిడ్డ
కల్హేర్(నారాయణఖేడ్): మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా బిడ్డ.. అంటూ కానిస్టేబుల్ సందీప్‌కుమార్ తల్లి భూదేవి కన్నీటి పర్యంతమైంది. మండల కేంద్రంలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. సంగారెడ్డిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ కోటారి సందీప్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. స్నేహితులు, బంధువులు భారీ సంఖ్యలో వచ్చారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
విలపించిన కానిస్టేబుల్ సందీప్‌కుమార్ తల్లి


