క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి

Nov 5 2025 9:13 AM | Updated on Nov 5 2025 9:13 AM

క్రీడ

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి

వట్‌పల్లి(అందోల్‌): మండల పరిధిలోని దరఖాస్తుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు ఎంపికయ్యాడు. మంతూరి కార్తీక్‌ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి హనుమకొండ క్రీడాపాఠశాలకు ఎంపికై నట్లు మండల విద్యాధికారి రంజిత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం అశోక్‌ , ఉపాధ్యాయురాలు లతతో పాటు పలువురు బాలుడిని అభినందించారు. ఈ సందర్భంగా కార్తీక్‌ తండ్రి అంజయ్య ఆనందం వ్యక్తం చేశారు.

కబడ్డీ పోటీలకు..

నంగునూరు(సిద్దిపేట): రాష్ట్ర స్థాయి అండర్‌ –17 కబడ్డీ పోటీలకు గట్లమల్యాల విద్యార్థి ఎంపికై ందని హెచ్‌ఎం రమేశ్‌, పీఈఓ రాజ్‌కుమార్‌ తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి డి.అను జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర జట్టుకు ఎంపికై ందన్నారు. 69వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి బద్రాద్రి కొత్తగూడెంలో జరిగే కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు.

అంగన్‌వాడీలో

కుళ్లిన కోడిగుడ్లు

హుస్నాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అధికారులు కుళ్లిన కోడిగుడ్లు ఇచ్చి అనారోగ్యాలకు గురి చేస్తున్నారు. పట్టణంలోని శివాజీ నగర్‌లోని అంగన్‌వాడీలో కుళ్లిపోయిన గుడ్లను అందజేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లి గుడ్లను ఉడకపెట్టగా దుర్వాసన వస్తుందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీడీపీఓ జయప్రద కేంద్రాన్ని సందర్శించి కోడిగుడ్లను పరిశీలించారు. కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్‌ బాబు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

లోక్‌ అదాలత్‌లో

రాజీ కుదర్చాలి

సిద్దిపేటకమాన్‌: ఈ నెల 15న జరగనున్న లోక్‌ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు రాజీ కుదర్చాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రిన్సిపల్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి మిలింద్‌ కాంబ్లే అన్నారు. స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ సందర్భంగా సిద్దిపేట కోర్టు భవనంలో జిల్లా బ్యాంకు మేనేజర్లు, స్టాండింగ్‌ కౌన్సిల్స్‌తో న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బ్యాంకు రికవరీ, చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

భర్త మృతి

భార్యకు తీవ్ర గాయాలు

బాన్సువాడ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలపాలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నాగల్‌ల్‌గిద్ద మండలం గరుకుచెట్టు తండాకు చెందిన కెతావత్‌ వసూరాం (52), భార్య దూరిబాయితో కలిసి టీవీఎస్‌ ఎక్సెల్‌పై మంగళవారం కామారెడ్డి వైపు బయలుదేరారు. ఈ క్రమంలో బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా మూలమలుపు వద్ద వారి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వసూరాం అక్కడికక్కడే మృతి చెందాడు. దూరిబాయి తీవ్రంగా గాయపడగా, బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ శ్రీధర్‌ తెలిపారు.

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి1
1/3

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి2
2/3

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి3
3/3

క్రీడాపాఠశాలకు ఎంపికై న విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement