
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే: హరీశ్ రావు
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు .. రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి .. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగ పోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు.