బీసీ గురుకుల సంస్థల జాయింట్ సెక్రటరీ శ్యామ్‌ప్రసాద్‌లాల్
వర్గల్(గజ్వేల్): ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో అధిక లాభం పొందేది భారతదేశమేనని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల సంస్థల జాయింట్ సెక్రటరీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ అన్నారు. వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ విభాగం అధికారులు ‘మర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ వల్ల కలిగే లాభనష్టాలను వివరించారు. సదస్సులల్లో విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. సదస్సులో చైన్నె విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఘట్కేసర్ శ్రీనిధి యూనివర్సిటీ, గవర్నమెంట్ సిటీ కాలేజీ, అరోరా కాలేజీ, సోషల్ వెల్ఫేర్ కాలేజీలు, నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, హైద్రాబాద్ జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల రీసెర్చ్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించారు. వీటి సారాంశాన్ని సావెనీర్‌గా రూపొందించారు. సదస్సులో శ్రీనిధి యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మ, రాధిక, సాహెలీ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు, వైస్‌ప్రిన్సిపాల్ గోవిందరావు, ఏటీపీ ఉమామహేశ్వరి, డాక్టర్ నిఖిత, డాక్టర్ రాధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషన్ పేరుతో ఫేక్ కాల్స్
ట్రేడ్ లైసెస్స్ ఫీజులు చెల్లించాలని వ్యాపారులకు ఫోన్
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఉమా పేరుతో సైబర్ కేటుగాళ్లు ఫేక్ కాల్స్ చేయడం కలకలం రేపింది. ట్రేడ్ లైసెస్స్ ఫీజులు చెల్లించాలని రెన్యూవల్ చేసుకోవాలని, మిషన్ భగీరథ బిల్లులు చెల్లించాలని శుక్రవారం ఉదయం నుంచి వ్యాపారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేయడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. అనుమానం రావడంతో విషయాన్ని వ్యాపారులు కమిషనర్‌కు చెప్పారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లకు గాని మున్సిపల్ అధికారిక ఖాతాలో మాత్రమే బిల్లులు చెల్లించాలని ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఉమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు.