భయం వీడితే..
5 నిమిషాల నిబంధన అమలులో..
పరీక్ష కేంద్రాలల్లోకి వెళ్లేందుకు విద్యార్థులకు పరీక్ష సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే అనుమతి ఉంటుంది. అందువలన విద్యార్థులు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకొని హాల్‌లో కూర్చునే అవకాశం ఉంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. 5 నిమిషాల నియమం అమలులో ఉన్నందున పరీక్ష కేంద్రానికి త్వరగా చేరుకోవాలి. హడావిడిగా తీరా సమయానికి పరీక్షకు బయలు దేరితే కేంద్రానికి చేరుకోవడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.
రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు గాను విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పది పరీక్షలు విద్యార్థుల జీవితాల్లో తొలిమెట్టుగా భావిస్తారు. పరీక్షలు అనగానే విద్యార్థులు హడావిడి, భయం, ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. ఇవన్నీ దూరంగా పెట్టుకుంటేనే ప్రశాంతంగా పరీక్షలు రాయగలుగుతామని, అనుకున్న విజయాన్ని సాధిస్తామని పలురంగాల నిపుణులు విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
జిల్లాలోని ప్రభుత్వ, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 14,124 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితో పాటుగా 1,763 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకోసం జిల్లాలో 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం 79 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 79 చీఫ్ డిపార్ట్‌మెంటల్ అధికారులు, నలుగురు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు, ఏడుగురు రూట్ ఆఫీసర్స్‌లు, 50 మంది స్టోరేజీ పాయింట్ కస్టోడియన్, 707 మంది ఇ న్విజిలెటర్‌లు పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే పదవ తరగతి పరీక్ష పేపర్‌లను జిల్లాలోని 25 స్టోరేజ్ పాయింట్‌లలో భద్ర పరిచారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు.
టోల్‌ఫ్రీ నంబర్లు
పదవ తరగతి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌లకు ఫోన్ చేసి వారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు 98664 15124, 99088 73455 నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉండ నున్నాయి.
ప్రశాంతంగా పది పరీక్షలు రాద్దాం
ముందు వచ్చినవి.. తర్వాత రానివి రాయాలి
హడావిడి లేకుండా
పరీక్ష కేంద్రానికి చేరుదాం
జంక్ ఫుడ్ వద్దు..
ద్రవరూప ఆహారమే ముద్దు..
విద్యార్థులకు పలు రంగాల
నిపుణులు సూచన
పరీక్షలు రానున్న 14,124 మంది
163 బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలు
సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలు అమలులో ఉంటాయని సిద్దిపేట సీపీ అనురాధ బుధవారం తెలిపారు. 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నందున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పై నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడి ఉండకూడదని, సమీపంలోని అన్ని జీరా క్స్ సెంటర్లను మూసివేసి ఉంచాలని పేర్కొన్నారు. పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సీపీ ఆదేశించారు.