కేబుల్‌ దొంగతనానికి వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

కేబుల్‌ దొంగతనానికి వెళ్లి..

Mar 17 2025 9:32 AM | Updated on Mar 17 2025 9:32 AM

కేబుల

కేబుల్‌ దొంగతనానికి వెళ్లి..

జోగిపేట(అందోల్‌): బోరు మోటరు కేబుల్‌ వైర్లను దొంగిలించడానికి వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన అందోలు శివారులోని వ్యవసాయ పొలం వద్ద శనివారం రాత్రి జరిగింది. సీఐ అనీల్‌కుమార్‌ కథనం ప్రకారం... కొక్కొండ జగదీశ్‌ అనే రైతు కౌలుకు తీసుకున్న భూమిలో వరి పొలానికి నీరు పారబెట్టడానికి ఆదివారం ఉదయం పొలం వద్దకు రాగా బోరు వద్ద కరెంటు సరఫరా లేకపోవడం, కేబుల్‌ను ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించి వెళ్తుండగా అక్కడే పడి ఉన్న యువకుడి మృతదేహన్ని చూసి పోలలీలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కూలీ పనిచేసుకొని జీవించే జోగిపేట పట్టణానికి చెందిన చిత్తారి సంగమేశ్‌ (30)గా గుర్తించారు. బోరు వద్ద గల ప్యానెల్‌ బోర్డు స్విచ్‌ తీసేసి కేబుల్‌ వైరును కటింగ్‌ ప్లేర్‌తో కట్‌ చేసే క్రమంలో అతడి మెడకు ఉన్న గొలుసుకు విద్యుదాఘాతం తగిలి తల కొద్ది భాగం తెగిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దాబాల్లో మద్యం

సరఫరా చేస్తే చర్యలు

సిద్దిపేట ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌

సిద్దిపేట కమాన్‌: దాబాల్లో మద్యం సరఫరా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పలు దాబాల్లో ఆదివారం ఎకై ్సజ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్‌ఎస్‌, గాయత్రి, మయూరి, చాముండి, సాయిరామ్‌, గ్రీన్‌, దుర్గా దాబాలపై తనిఖీలు నిర్వహించి చట్టవిరుద్ధంగా మద్యం సేవిస్తున్న 9మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సరఫరా చేస్తున్న దాబా నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విద్యుదాఘాతంతో ఆవు మృతి

చేర్యాల(సిద్దిపేట): విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగపురి శివారు గండికుంటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పడాల చంద్రయ్యకు చెందిన పాడి ఆవు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దీంతో రూ.80 వేల వరకు నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.

ద్విచక్ర వాహనాన్ని

ఢీకొట్టిన లారీ

ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు

కొండపాక(గజ్వేల్‌): ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం... కొమురవెళ్లి గ్రామానికి చెందిన సార్ల గణేశ్‌, బావమరిది చిక్కుడు సత్తయ్య కలిసి ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై విశ్వనాథపల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథపల్లికి టర్న్‌ అవుతుండగా హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ శేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా

ట్రాక్టర్‌ స్టేషన్‌కు తరలింపు

చేర్యాల(సిద్దిపేట): పట్టణ శివారులోని గుర్జకుంట వాగు నుంచి కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసు కను తరలిస్తుండగా ఆదివారం చేర్యాల పోలీసులు అడ్డుకొని ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు ఆర్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తు న్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజమేనని తెలవడంతో చర్యలు తీసుకున్నారని పేర్కొ న్నారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేబుల్‌ దొంగతనానికి వెళ్లి.. 1
1/1

కేబుల్‌ దొంగతనానికి వెళ్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement