ఎట్టకేలకు తెరుచుకున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీ | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు తెరుచుకున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీ

Published Sun, Jun 16 2024 10:46 AM | Last Updated on Sun, Jun 16 2024 10:46 AM

-

జహీరాబాద్‌ టౌన్‌: రెండు నెలల నుంచి మూతబడిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఎట్టకేలకు తెరుచుకుంది. శనివారం ఆస్పత్రిని ఓపెన్‌ చేయడంతో సీఐటీయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలో సుమారు 5 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారి వైద్యం కోసం జహీరాబాద్‌ పట్టణంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సొంత భవనం లేక ప్రారంభం నుంచి అద్దె ఇంటిలో దీనిని కొనసాగించారు. అగ్రిమెంట్‌ ప్రకారం రెండేళ్ల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని డిస్పెన్పరీకి తాళం వేశాడు. దీంతో కార్మికులు వైద్యం కోసం ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై సీఐటీయూ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఉన్నత అధికారులు స్పందించి డిస్పెన్సరీని తెరిపించారు. ఇప్పటికైనా సొంత భవనం నిర్మించి 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని జిల్లా కార్యదర్శి మహిపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement