ప్రభుత్వ భూమిని కాపాడండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిని కాపాడండి

Jul 22 2026 9:00 AM | Updated on Jul 22 2026 9:00 AM

ప్రభుత్వ భూమిని కాపాడండి

ఇబ్రహీంపట్నం రూరల్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూర్‌ రెవెన్యూలోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని, నిషేధిత జాబితాలో చేర్చాలని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునగనూర్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 44లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఆరోపించారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీఎల్‌ఏ గుర్తించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్యాక్రాంతంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై అధికారులు తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ శారదాదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బోసుపల్లి ప్రతాప్‌, నారాయణయాదవ్‌, కొత్త రామ్‌రెడ్డి, బచ్చిగళ్ల రమేష్‌, కొండ్రు పురుషోత్తం, యూసుఫ్‌రెడ్డి, నోముల కార్తీక్‌రెడ్డి, మల్లెల ప్రేమ్‌సాయి, కొలను రవీందర్‌రెడ్డి, నందగిరి సురేష్‌, గుండ కృష్ణరామ్‌రెడ్డి, ఎల్మినేటి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement