షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిచింది. ఫరూఖ్‌నగర్ తహసీల్దార్ నాగయ్య మంగళవారం పట్టణంలోని పాతజాతీయ రహదారి పక్కన ఉన్న పాత కోర్టు స్థలాన్ని పరిశీలించారు. సర్వే నంబర్ 178లోని 35 గుంటల భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు హద్దులు ఏర్పాటు చేసి సబ్ రిజిస్ట్రార్‌లు వికాస్‌రెడ్డి, శేషగిరికి అప్పగించారు.


