మీర్‌పేట: పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రూ.50 వేల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం మీర్‌పేటకు వచ్చి నివాసముంటోంది. 2024లో ఇదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కిషన్‌నాయక్ చౌహాన్ (44) ఆ కుటుంబంలోని బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిడ్నాప్ చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కిషన్‌నాయక్‌పై కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి తీర్పు వెలువరించారు.
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
Jul 22 2026 9:00 AM | Updated on Jul 22 2026 9:00 AM
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: అతిథి అధ్యాపకుల కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.రాధిక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్–2, డెయిరీ సైన్స్–1, క్రాప్ ప్రొడక్షన్ –1, మొత్తం 4 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పీజీ సబ్జెక్టుల్లో జనరల్ వారు 55, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్‌తోపాటు బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎంపికై న వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రకారం గంటల ప్రాతిపదికన నెలకు గరిష్టంగా 72 గంటల గౌరవ వేతనం లభిస్తుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 24 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలోని కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు 83749 39833 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని మంగళవారం ఇస్రో మాజీ శాస్త్రవేత్త శ్రీనివాసులు దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శేషవస్త్రంతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. పురాతన శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జీ అప్రజాస్వామికం
షాద్‌నగర్: నీట్, యూజీ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అప్రజాస్వామికమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం విద్యార్థుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టినా, నిర్బంధాలు, లాఠీచార్జీలు చేసినా విద్యార్థి ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
పోక్సో కేసులో
ఏడేళ్ల జైలుశిక్ష
Advertisement


