భగీరథ్‌ను అరెస్టు చేయాలి | - | Sakshi
Sakshi News home page

భగీరథ్‌ను అరెస్టు చేయాలి

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌

ఆమనగల్లులో భారీ ర్యాలీ

ఆమనగల్లు: బాలికను లైగింక వేధింపులకు గురిచేసిన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌గుప్తా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆడ పిల్లలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, రమేశ్‌, భాగ్యలక్ష్మి, నాగిళ్ల జగన్‌, పుల్లారెడ్డి, అనుషా, వీరయ్య, సయ్యద్‌ ఖలీల్‌, సైదులుగౌడ్‌, పాండు, సతీశ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement