కడ్తాల్: పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, భద్రత చర్యలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో గోరక్షక సమితి, హిందూ వాహిని సభ్యులు, యువజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా వాహనాల్లో కబేళాలకు గోవులను తరలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులను గాయపర్చడం వంటి చర్యలకు పాల్పడొద్దని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమాచారంపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు చేపడుతామని స్పష్టంచేశారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. పండుగల వేళ మతసామరస్యాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వరప్రసాద్, గోరక్షక సమితి నాయకులు రెడ్యా, హిందూవాహిని సభ్యు లు, యువజన సంఘాల నాయకులు ఉన్నారు.
చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
సీఐ సైదిరెడ్డి


