షాద్‌నగర్ రూరల్: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీనునాయక్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ నాగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. బడుగుబలహీన వర్గాలకు చెందిన వారు తప్పు చేస్తే జైలులో పెట్టడం, ఎన్‌కౌంటర్ చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల్లో చట్టం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, వేగవంతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. భగీరథ్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కావలి రాజు, శ్రీనివాస్, లక్ష్మి, అంజమ్మ, రాజు తదితరులు ఉన్నారు.
సీపీఎం నేతల డిమాండ్
తహసీల్దార్‌కు వినతిపత్రం


