హుడాకాంప్లెక్స్: మానసిక, శారీరక దృఢత్వానికి దోహదం చేసే క్రీడలపై చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. వీరికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అండగా నిలుస్తోంది. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సరూర్‌నగర్ స్టేడియంలో నిత్యం ఉదయం 6నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4నుంచి 6గంటల వరకు అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫోన్లు, టీవీలు, ట్యాబ్‌లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు సైతం కొంత సమయం కేటాయిస్తున్నారు. రోజూ తమ పిల్లలను వెంట పెట్టుకుని క్రీడాప్రాంగణానికి చేరుకుంటున్నారు.
మెలకువలు నేర్పిస్తూ..
ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలతో పాటు మారుమూలల నుంచి తరలివస్తున్న క్రీడా ఔత్సాహిక బాలబాలికలతో ఇండోర్/ అవుట్ డోర్ స్టేడియాలు సందడిగా మారుతున్నాయి. తల్లిదండ్రులు వాకింగ్, జాగింగ్ చేస్తుండగా, పిల్లలు జిమ్నాస్టిక్, స్కేటింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, కరాటే, టెన్నిస్, వాలీబాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ తదితర క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. కోచ్‌లు సైతం వీరిని ఆయా ఆటల్లో రా టుదేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ ప్రతి భ చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. దీనికితోడు ఉద్యోగ నియామకాల్లోనూ రిజర్వేషన్ లభించే అవకాశం ఉంటుంది.
క్రీడాంశం శిక్షణకాలం ఫీజు
క్రికెట్ 30 రోజులు రూ.1000
స్విమ్మింగ్ 30 రోజులు రూ.1,500
అథ్లెటిక్స్ 30 రోజులు రూ.1,000
బాస్కెట్‌బాల్ 30 రోజులు రూ.2,000
స్కేటింగ్ 30 రోజులు రూ.2,000
జిమ్నాస్టిక్స్ 30 రోజులు రూ.1,000
బ్యాడ్మింటన్ 30 రోజులు రూ.2,500
వాలీబాల్ 30 రోజులు రూ.1,000
టెన్నిస్ 30 రోజులు రూ.15,00
బాక్సింగ్ 30 రోజులు రూ.500
కరాటే 30 రోజులు రూ.500
కబడ్డీ 30 రోజులు రూ.500
టేబుల్ టెన్నిస్ 30 రోజులు రూ.2,000
సద్వినియోగం చేసుకోవాలి
ఏడేళ్ల పైబడిన పిల్లలకు ఇక్కడ వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాం. పిల్లలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. క్రీడలతో పిల్లలు ఒత్తిడిని తట్టుకుని చదువులో రాణించే అవకాశం ఉంటుంది. క్యాంప్‌ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– స్వర్ణలత, డీఎస్‌డీఓ
వాలీబాల్ శిక్షణ
నాకు చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడటం ఇష్టం. ఈ క్రీడలో రాణించాలనే పట్టుదలతో నిత్యం ఉదయం ఐదు గంటలకే స్టేడియానికి చేరుకుని రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నా. ఉదయం గ్రౌండ్‌లో గడపడం మనసుకు ప్రశాంతతనిస్తోంది. కోచ్‌లు ఆటల్లో మెలకువలను నేర్పిస్తున్నారు.
– నయిమిషాశ్రీ, ఎల్బీనగర్
వేసవి శిబిరానికి పోటెత్తుతున్న
బాలబాలికలు
సరూర్‌నగర్ స్టేడియంలో
సందడే సందడి
తల్లిదండ్రులతో
కలిసి వచ్చి నచ్చిన క్రీడల్లో శిక్షణ
సరూర్‌నగర్ స్టేడియంలో
వేసవి శిక్షణ శిబిరాల ఫీజులు ఇలా


