నేపాలీ.. వివరాలు చూపాలి! | - | Sakshi
Sakshi News home page

నేపాలీ.. వివరాలు చూపాలి!

May 14 2026 10:47 AM | Updated on May 14 2026 10:47 AM

రాజధానిలో పనిమనుషుల గురించి పోలీసుల ఆరా

సాక్షి, సిటీబ్యూరో

గరంలో నేపాలీ పనిమనుషులు ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంతమంది ఉన్నారు.. ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. మొన్న ప్రశాసన్‌నగర్‌లోని మాజీ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే ఇంట్లో... తాజాగా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని కౌకూరు గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌లో ఉండే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మురళీధర్‌ మోహన్‌ ఇంట్లో నేపాలీలు పంజా విసిరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్లలో సర్వేంట్స్‌ వెరిఫికేషన్‌ను బుధవారం నుంచి మొదలుపెట్టారు.

వీరికి సంబంధించి సరైన రికార్డుల ఉండట్లేదు...

రాజధానిలోని ఎగువ మధ్య తరగతి, ఉన్నత కుటుంబాల ఇళ్లకు ఇదివరకు సర్వెంట్స్‌ ఉదయం, సాయంత్రం వచ్చి పనిచేసేవారు. ప్రస్తుతం ఇళ్లల్లోనే 24 గంటలూ అందుబాటులో ఉండే సంస్కృతి వచ్చింది. దీంతో ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలతోపాటు నేపాల్‌కు చెందినవారూ ఈ పనిలోకి వస్తున్నారు. సర్వెంట్స్‌, డ్రైవర్స్‌, కుక్స్‌.. ఇలా వివిధ పనుల్లోకి వీరిని యజమానులు నేరుగా, లేదా దళారుల ద్వారా నియమించుకుంటున్నారు. ఆయా సమయాల్లో వారి వివరాల సేకరణ, నమోదు లేకపోవడంతో యజమానుల వద్ద ఎలాంటి రికార్డులు ఉండట్లేదు.

2 రకాలుగా నమోదు..

గుర్తించే సరికే సరిహద్దులు దాటేస్తూ..

ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. బరితెగించిన పనిమనుషుల వివరాలు సేకరించడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. ఘటనాస్థలి నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వందల సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి పరిశీలించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి నేరగాళ్లు సరిహద్దులు దాటి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసులు కొలిక్కిరాకపోవడమో, నిందితులందరూ అరెస్టు కాకపోవడ మో, రికవరీలు లేకపోవడమో జరుగుతోంది. ఫలితంగా బాధితుడు నష్టపోవడంతోపాటు మరికొంద రు నేరగాళ్లు నేరం చేసేలా ప్రేరణ పొందుతున్నారు.

వరుస ఉదంతాల నేపథ్యంలో డీజీపీ ఆనంద్‌ ఆదేశాలు

ఠాణాలవారీగా వివరాలు సేకరిస్తున్న క్షేత్రస్థాయి అధికారులు

నాలుగు కమిషనరేట్లలోనూ ప్రారంభమైన ప్రక్రియ

ఆయా ఇళ్లల్లో పనిచేసే వారితోపాటు నేపాలీల వివరాలు సేకరించాలని డీజీపీ నిర్ణయించారు. దీంతో బుధవారం నుంచి నాలుగు పోలీసు కమిషనరేట్లలో క్షేత్రస్థాయిలో ఉండే బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ మొబైల్స్‌తోపాటు సెక్టార్‌ ఎస్సైలు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పనిమనుషుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. వారి వేలిముద్రలు, ఫేషియల్స్‌ను అధికారిక మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా తనిఖీ చేస్తూ గత చరిత్రను పరిశీలిస్తున్నారు. పోలీసుస్టేషన్‌ స్థాయిలో రిజిస్టర్లు ఏర్పాటు చేసి, వాటిలో ఆయా ఇళ్లల్లో పనిచేస్తున్న నేపాలీలతోపాటు వారిని నియమించిన వారి వివరాలు, పేర్లు, ఫొటోలు, ఫోన్‌ నెంబర్లు, ఇతర గుర్తింపుకార్డుల్ని సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను గరిష్టంగా వారం రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్లు వీసీ సజ్జనర్‌, ఎం.రమేష్‌, బి.సుమతి, తరుణ్‌ జోషి ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా పోలీసు కమిషనర్లు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement