విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు | - | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

May 14 2026 10:47 AM | Updated on May 14 2026 10:47 AM

ఇబ్రహీంపట్నం: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన వినోబానగర్‌లో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక గురుకుల విద్యాపీఠ్‌్‌లో నిర్వహించిన విద్యావారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యారంగాభివృద్ధికి రేవంత్‌ సర్కార్‌ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఇందులో భాగంగా ఆరుట్ల పబ్లిక్‌ స్కూల్‌, నియోజకవర్గానికి ఒక యంగ్‌ ఇండియా స్కూల్‌, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ, స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారని వివరించారు. భవిష్యత్తు తెలంగాణ రేపటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని.. ఆ దిశగా అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్‌ స్కూల్స్‌ను తలదన్నే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ భోధన పద్దతుల్లో మార్పులు తీసుకురావాలన్నారు.

విద్యార్థుల ఇబ్బందులకు చెక్‌

ఒకే చోట డిగ్రీ, ఇంటర్‌ తరగతులు షిప్ట్‌ పద్ధతిలో కొనసాగడంతో విద్యార్థుల ఇబ్బందులు తీరుతాయన్నారు. కొత్తగా నిర్మించిన డిగ్రీ కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ అనంతరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాధిక, భూదాన్‌బోర్డు మాజీ చైర్మన్‌ గున్న రాజేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యాశాఖాధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement