మాడ్గుల: పంచాయితీ రాజ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సూదిని రాంరెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రమంజిల్‌లోని తన కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో అభినందించారు. వీరిలో సూదిని లక్ష్మారెడ్డి, సూదిని అరవింద్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాయితి సాయిరెడ్డి, రవికాంత్, యాదయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు.
పేదల వైద్యుడి కన్నుమూత
బొంరాస్‌పేట: యాభై ఏళ్ల క్రితం సైకిల్‌పై పల్లెలకు, గిరిజన తండాలకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి, వైద్యం అందించిన దూగుర్ రాఘవేంద్రచారి(90) బుధవారం మృతిచెందారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ)గా పనిచేసిన ఆయన గ్రామీణ ప్రజలకు యాభై ఏళ్ల పాటు వైద్యం చేసి, పేదల వైద్యుడిగా మంచి పేరు సంపాదించారు.
కల్లు దుకాణం వద్ద
మహిళ మృతి
బొంరాస్‌పేట: మండలంలోని నాందార్‌పూర్‌లో ఓ మహిళ కల్లు దుకాణం వద్ద మృతి చెందింది. గ్రామస్తు లు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంబళ్ల తుల్జమ్మ (53) సోమవారం రాత్రి 8 గంటలకు కల్తీకల్లు తాగి ఇంటికి తిరిగి వస్తుంటే దుకాణం సమీపంలో కిందపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహిళ మృతి చెందినట్లు వై ద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతు రాలి తండ్రి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీకల్లు కారణంగానే తుల్జమ్మ చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపించారు.
వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి ఐసీయూలో చికిత్స
మన్సూరాబాద్: వీధి కుక్కల దాడిలో గాయపడి ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్వీక్‌కు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నామని కామినేని వైద్యులు తెలిపారు. బాగా లోతైన కుక్క గాట్లు ఉండటంతో ఇన్‌ఫెక్షన్ సోకకుండా మందులు ఇస్తున్నామని, ఎప్పటికప్పుడు ఇన్‌ఫెక్షన్‌ను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. బాలుడు స్పృహలోనే ఉన్నాడని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని, మరో 24 గంటలు గడిస్తే పరిస్థితి తెలుస్తుందని వైద్యులు స్పష్టం చేశారు.


