కొడంగల్‌లో ‘పేదల తిరుపతి’
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పేదల తిరుపతిగా పేరు గాంచింది. ఇక్కడ తిరుమల తరహాలో ఉత్సవాలు, నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారికి చేసే వాహన సేవలు, గరుడోత్సవం, లంకా దహనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే రెండేళ్లకోసారి పవిత్రోత్సవాలు జరుగుతాయి. స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో ఈఆలయాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.110 కోట్లు మంజూరు చేశారు. వైకుంఠ ఏకాదశి, ఇంగ్లిష్ నూతన సంవత్సరం నేపథ్యంలో భక్తులకు భారీగా తరలివస్తారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.


