సమస్యలు పరిష్కరించాలని వినతి
అబ్దుల్లాపూర్‌మెట్: సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం జిల్లా పంచాయతీ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శులకు వెంటనే రెమ్యూనరేషన్ ఇవ్వాలని, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల ఎగ్జిక్యూటివ్ సమయం పై ఈ వారంలో ఉత్తర్వులు ఇవ్వాలని, ఓపీఎస్ సాలరీస్ కోసం, ఎన్నికల ఖర్చులు తదితరులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ యాదవ్, కోశాధికారి గౌస్, వైస్ ప్రెసిడెంట్ రహీమ్ పాషా, జాయింట్ సెక్రటరీ సూరిబాబు, ఈసీ మెంబర్ వెంకటేశ్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.


