హవ్వా.. ఆస్పత్రిలో షూటింగ్‌ ! | - | Sakshi
Sakshi News home page

హవ్వా.. ఆస్పత్రిలో షూటింగ్‌ !

Nov 27 2026 12:02 AM | Updated on Nov 27 2026 12:02 AM

వేములవాడఅర్బన్‌: పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం సినిమా షూటింగ్‌ నిర్వహించడంతో పేషెంట్లకు ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రి ప్రాంగణంలో ‘జిల్లేడు చెట్టు’ సినిమా షూటింగ్‌ నిర్వహించారు. ఇదే సమయంలో గాయపడిన వ్యక్తి రావడంతో అత్యవసరమార్గం ద్వారా తీసుకెళ్లకుండా పక్కదారి నుంచి వెళ్లాలని షూటింగ్‌ మేనేజర్‌ చెప్పడంతో పేషంట్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదానికి దిగారు. సినిమా షూటింగ్‌కు అనుమతులు ఉన్నాయా అని రోగులు ప్రశ్నించడంతోపాటు ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement