అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న దళిత నాయకులు
నివాళి అర్పిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ,
బీఆర్ఎస్ నేతలు
నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు
సిరిసిల్లటౌన్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సిరిసిల్లలోని అంబేడ్కర్ విగ్రహానికి వివిధ రాజకీయపార్టీల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, కౌన్సిలర్లు బూర బాలు, వేముల రాములు, లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ, దొంతునేని కళ్యాణి, మొగిలి నాగరాజు, ఎలుక వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి నాయకత్వంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ఎర్ర మహేశ్, లింగంపల్లి శంకర్, చంటి మహేశ్, ఆడెపు రవీందర్, పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, దుమాల శ్రీకాంత్, మామిడాల మహేశ్, వేముల వైశాలి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం, మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మాల మహానాడు జాతీయ నాయకులు రాగుల రాములు, నక్క నర్సయ్య, రాగుల జగన్, బొడ్డు నారాయణ, ఎడ్ల నరేశ్‌కుమార్, ఆవునూరి వెంకటరాములు, త్యాగరాజు, గొల్లపల్లి పరశురాం, ఎడ్ల రవి తదితరులు పాల్గొన్నారు. సామాజిక సమరసత వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్, కోడం రవి, సుంకోజు రమేశ్‌చారి, చిమ్మని ప్రకాశ్, గుడ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.


