సిరిసిల్లటౌన్: ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో ఆడపడుచులకు బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. కౌన్సిలర్ వేముల రాములు, కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, చేరాల స్వాతి, పద్మ, నీలిమ, సయ్యద్ షాదబ్ పాల్గొన్నారు.
28న ‘కిసాన్ మేళా’
తంగళ్లపల్లి: జిల్లా ఆత్మ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28న జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో ‘కిసాన్ మేళా’ నిర్వహించనున్నట్లు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ గురువారం ప్రకటనలో తెలిపారు. రైతుల శ్రేయస్సు లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శన, అవగాహన సదస్సులో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, మెరుగైన విత్తనాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు.
నివేశన స్థలాలు,
ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
సిరిసిల్ల అర్బన్: పేదలకు నివేశన స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఐ అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈమేరకు ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గుంటి వేణు, పంతం రవి, మీసం లక్ష్మి, అంజిరెడ్డి, మంజుల, శారద, సులోచన పాల్గొన్నారు.
కొర్రీలు లేకుండా
కొనుగోలు చేయాలి
రుద్రంగి: ధాన్యాన్ని కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతూ రుద్రంగిలో రైతన్నలు గురువారం ధర్నా చేశారు. మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని 10 రోజుల క్రితం ప్రారంభించి తూకం వేయడం లేదన్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుకాణాల వేలానికి
స్పందన కరువు
వేములవాడరూరల్: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆ లయానికి చెందిన 102 షాపులకు ఈవో రమాదేవి గురువారం టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. పట్టణంలోని జాతరగ్రౌండ్, చెక్కపల్లి బస్టాండ్ సంస్కృత పాఠశాల కాంప్లెక్స్‌లలోని షాపులకు ఎవరూ ముందుకురాలే దు. కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆ లయానికి చెందిన 36 దుకాణాలకు 30 దు కాణాలను వ్యాపారులు దక్కించుకున్నారు. జా తరగ్రౌండ్‌లో దాదాపు 50 దుకాణాలు ఉండగా.. ఆలయ పునర్‌నిర్మాణ పనులతో భక్తులు రావడం లేదని టెండర్‌లో పాల్గొనేందుకు వ్యా పారులు ఆసక్తి చూపలేదు. 15 టేలాలకు మా త్రమే టెండర్లు పూర్తయ్యాయి. మిగిలిపోయిన దుకాణాలకు మరోసారి టెండర్లు నిర్వహిస్తామ ని ఈవో తెలిపారు. డీఈవో నవీన్‌కుమార్, ఏఈవో మహేశ్, జయకుమారి, పర్యవేక్షకులు శివ, మహేశ్, కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.


