● తిప్పాపూర్‌లో తప్పని ట్రాఫిక్ కష్టాలు ● ఇబ్బంది పడుతున్న వాహనదారులు ● ముందుకుసాగని జంక్షన్ సుందరీకరణ
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలివస్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచీ రద్దీ ఉంటుంది. కొందరు ఆర్టీసీ బస్సుల్లో వస్తుండగా.. మరికొందరు ప్రైవేటు, సొంత వాహనాల్లో చేరుకుంటారు. అయితే రాజన్నను దర్శించుకోకముందే భక్తులు ట్రాఫిక్ వలయం చిక్కుకుని చుక్కలు చూస్తున్నారు. వేములవాడ స్వాగత తోరణంగా పేరొందిన మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. తరచూ వాహనాలు నిలిచిపోవడంతో వామ్మో ఇదేం ట్రాఫిక్ అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఒకేచోట నాలుగుదారులు
తిప్పాపూర్ తెలంగాణచౌక్ వద్ద నాలుగు రహదారులు కలవడంతో ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌తో కూడిన నాలుగు రహదారుల చౌరస్తాలో ఇరుకుదారి ఇబ్బందికరంగా మారింది. నిత్యం పోలీసులు అక్కడే ఉండి ట్రాఫిక్ క్లియర్ చేసినా కష్టాలు తప్పడం లేదు. జంక్షన్ సుందరీకరణ పనులు చేస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని స్థానిక ప్రజలు సూచిస్తున్నారు.
జంక్షన్ సుందరీకరణ ఎప్పుడో
తిప్పాపూర్ జంక్షన్ సుందరీకరణకు నగరాభివృద్ధి నిధులు రూ.కోటి మంజూరు చేశారు. 2026 జనవరి16న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పనులకు శంకుస్థాపన చేశారు. 10 నెలలు కావస్తున్నా సుందరీకరణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికై న అధికారులు స్పందించిన పనులు ప్రారంభించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.


