కేసీఆర్‌ ఆమరణ దీక్షతోనే తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఆమరణ దీక్షతోనే తెలంగాణ

Nov 24 2026 11:44 PM | Updated on Nov 24 2026 11:44 PM

ఇల్లంతకుంట: ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఏర్పాటుకు కీలకమైన ట్రిగ్గర్‌లా పని చేసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో మాట్లాడారు. ఈనెల 29న మానకొండూరు నియోజకవర్గం అలుగునూరు సమీపంలో చేపట్టే దీక్షాక్ష దివస్‌ను బీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, దీక్షా దివస్‌ తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి ప్రతీక అన్నారు. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని సభ విజయవంతం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సర్పంచ్‌ బద్దం శేఖర్‌రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, ఒగ్గు నరసయ్య, వెంకటనరసింహారెడ్డి, కట్ట వెంకటరెడ్డి, గుండ ముత్తయ్య, మీసరగండ్ల అనిల్‌కుమార్‌, ఒరుపుల రాములుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.11 కోట్లతో నాలుగు కొత్త సబ్‌స్టేషన్లు

సిరిసిల్లటౌన్‌: ఎన్పీడీసీఎల్‌ సిరిసిల్ల డివిజన్‌ పరిధిలో రూ.11 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. భవిష్యత్‌లో లో వోల్టేజ్‌ సమస్యను నివారించి, నిరంతర నాణ్యౖ మెన విద్యుత్‌ అందించేందుకు వీటిని మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌, ముస్తాబాద్‌ మండలం మొరా యిపల్లె గ్రామాల్లో ఈ కేంద్రాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా ఆయా గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల రైతులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన కరెంటు అందుతుందన్నారు. డీఈ అంజయ్య, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లఅర్బన్‌: పంచారామ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ సిరిసిల్ల డిపో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు డిపో మేనేజర్‌ భరత్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల నుంచి సూపర్‌ లగ్జరీ బస్సు బయల్దేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకొని తిరిగి 30న సిరిసిల్ల చేరుకుంటుందన్నారు. టికెట్‌ ధర రూ.2,800 నిర్ణయించామని, అలాగే శుభకార్యాలు, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు లభిస్తాయని వివరించారు. వివరాలకు 90634 03791, 63041 71291, 99592 25929 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

కబ్జా భూమిని స్వాధీనం చేసుకోవాలి

సిరిసిల్లఅర్బన్‌: ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సత్తయ్య అక్రమంగా కబ్జా చేసిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని తమకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన రైతులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా 19 ఏళ్ల పాటు పనిచేసిన సత్తయ్య 5 నుంచి 10 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాచేసిన భూమికి దారి కోసం పక్కనున్న పట్టాదారు రైతలపై రెండుమూడేళ్లుగా కేసులు వేస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, స్టే ఉంటే కౌంటర్‌ వేసి రద్దు చేయాలని కోరారు. రైతులు కోల సంతోష్‌గౌడ్‌, తడిసిన వెంకటేశ్‌, మొతుకుల ప్రవీణ్‌, బైరి లచ్చయ్య, బాలకిషన్‌, తడిసిన తార, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement