సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట: వ్యవసాయ పొలాల వద్ద వన్యప్రాణుల వేటకు అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజలు, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే మంగళవారం తెలిపారు. ప్ర మాదకరమైన ఈ చర్యలతో అటవీ జంతువులతో పాటు పొలాల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు ప్రాణాపాయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. స్టేషన్‌లలో రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఠాణాకు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. రాత్రి వేళ గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, ఎస్సైలు రమేశ్, బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


