వేములవాడ రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కోడె తదితర మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి జ్వాలాతోరణం మహోత్సవాన్ని శ్రీఅశ్వద్ధ నారాయణస్వామి రావిచెట్టు వద్ద కన్నులపండువగా నిర్వహించారు. హరిహరమూర్తులను పల్లకి సేవలో జ్వాలాతోరణం కింద నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. – వేములవాడఅర్బన్


