ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి లడ్డూను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చింతకింది బాలరాజుగౌడ్ రూ.1,00,116 దక్కించుకోగా, రెండో లడ్డూ ముత్యాల శ్రీపాల్‌రెడ్డి రూ.20,116, మూడో లడ్డూ సురేశ్‌రెడ్డి రూ.20,116 వేలంలో దక్కించుకున్నారు. లడ్డూ దక్కించుకున్న దంపతులను ఆలయ కమిటీ ఆధ్యర్యంలో సన్మానించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి మొక్కులు చెలించుకున్నారు.


