సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో పిల్లల ఆటలకు.. పెద్దల వ్యాయామానికి కేరాఫ్ జూనియర్ కాలేజీ గ్రౌండ్. కానీ సెప్టెంబర్ 30న జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. ఏర్పాట్లతో భాగంగా అదే నెల 29వ తేదీన రోడ్లు, భవనాల శాఖ అధికారులు హెలీప్యాడ్‌ను జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్మించారు. పర్యటన ముగిసిన తర్వాత హెలీ ప్యాడ్‌ను తొలగించకపోవడంతో పిల్లల ఆటలకు అడ్డంకిగా మారింది. ఈ విషయమై ఆర్అండ్బీ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా కాంట్రాక్టర్‌కు బిల్లు రాలేదని, బిల్లు మంజూరైతేనే.. హెలీప్యాడ్‌ను తొలగించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ చొరవ చూపి.. ఆర్అండ్బీ అధికారులతో చర్చించి హెలీప్యాడ్‌ను తొలగింపజేయాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.


