జిల్లా పోలీసులకు డీజీపీ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా పోలీసులకు డీజీపీ అభినందనలు

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

● కానిస్టేబుళ్ల స్పందనకు ఉన్నతాధికారుల అభినందనలు

● కానిస్టేబుళ్ల స్పందనకు ఉన్నతాధికారుల అభినందనలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రజల రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల బాధ్యత అని చాటిచెప్పిన ఎల్లారెడ్డిపేట పోలీసులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. మండలంలోని మొదటి బైపాస్‌రోడ్డుపై ఫిట్స్‌తో కుప్పకూలిన మహిళను గమనించిన కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, హోంగార్డు శ్రీనివాస్‌ వెంటనే స్పందించి ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. సకాలంలో స్పందించి మహిళకు సహాయం అందించడంపై పలువురు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన జిల్లా పోలీస్‌ శాఖ అధికారిక సోషల్‌ మీడియా పోస్టును పరిశీలించిన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ స్పందిస్తూ.. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న పోలీసులను అభినందించారు. వారి సేవలను గుర్తించి తగిన విధంగా ప్రశంసించి, రివార్డులు అందించాలని సూచించారు. డీజీపీ స్పందనపై సీఐ ఓదేల వెంకటేశ్‌, ఎస్సై రమేశ్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement