నేరుగా పంపింగ్‌ చేస్తే బ్యారేజీలు ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

నేరుగా పంపింగ్‌ చేస్తే బ్యారేజీలు ఎందుకు?

Jul 14 2026 12:00 AM | Updated on Jul 14 2026 12:00 AM

● మంత్రి వివేక్‌

● మంత్రి వివేక్‌

సిరిసిల్లటౌన్‌: గోదావరి నీళ్లను పంపింగ్‌ చేస్తే ఇక రూ.లక్ష కోట్లు వెచ్చించి కట్టిన బ్యారేజీలు ఎందుకని మంత్రి గడ్డం వివేక్‌ ప్రశ్నించారు. సిరిసిల్లలో సోమవారం పర్యటించిన ఆయన కాంగ్రెస్‌ సీనియ ర్‌ నాయకుడు గడ్డం నర్సయ్య ఇంట్లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి గోదా వరి నీళ్లను పంపు చేయాలని కేటీఆర్‌, హరీష్‌రావుగగ్గోలు పెట్టడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి మనుమడి కోసం బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చాలా సార్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరగా ప్రతిపక్ష లీడర్‌గా కేసీఆర్‌ ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. సెంట్రల్‌ కమిటీ రిపోర్ట్‌ ప్రకారమే బ్యారేజీలు నింపడం లేదన్నారు. కేటీఆర్‌, హరీష్‌రావు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారన్నారు. కల్వకుంట్ల కవిత అడిగిన రూ.1400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలని కోరారు. మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 2500 నిర్మించిన జిల్లా అధికారులు రికార్డు సృష్టించారని అభినందించారు. జిల్లాలో ఐటీఐ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న అర్హులకు టామ్‌కామ్‌ ద్వారా 100 మంది వరకు ఉద్యోగాలు కల్పిద్దామని హామీ ఇచ్చారు. అంతకుముందు పట్టణ శివారులో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. మాల మహానాడు జాతీయ నాయకుడు రాగుల రాములు కుమార్తె వివాహానికి హాజరయ్యారు. జిల్లా గ్రంథా లయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ వెల్ముల స్వరూపరెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, కౌన్సిలర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement