సెల్‌ కొనివ్వలేదని యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

సెల్‌ కొనివ్వలేదని యువకుడు..

Jun 16 2026 11:52 PM | Updated on Jun 16 2026 11:52 PM

చొప్పదండి: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని బిహార్‌కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చొప్పదండిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బిహార్‌ రాష్ట్రం అరలియా జిల్లాకు చెందిన నితీశ్‌ కుమార్‌కు నలుగురు అన్నలు ఉండగా పెద్దన్న కామారెడ్డిలో రైస్‌మిల్లులో పని చేస్తుండగా, అతనితో కామారెడ్డికి వచ్చాడు. స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని, రూ.10వేల నుంచి రూ.15 వేలు అవుతాయని చెప్పగా, నితీశ్‌ అన్న అంత డబ్బు లేదని, డబ్బు సర్దుబాటు అవ్వగానే కొనిస్తానని చెప్పి బిహార్‌ పంపించేందుకు చొప్పదండిలోని హరిప్రియ రైస్‌మిల్లులో పని చేసే మరో సోదరుడి దగ్గరకు పంపించాడు. చొప్పదండి నుంచి బిహార్‌ వెళ్లేవారు ఉండటంతో ఈ నెల 13న రైస్‌మిల్లుకు వచ్చాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకుని కనిపించాడు. స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని సోమవారం రాత్రి నితీశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement