అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్, కలెక్టర్ ఖమ్మం
మెట్‌పల్లి: సివిల్స్ సుదీర్ఘ ప్ర యాణం. కఠినమైన వడపోత ప్రక్రియ. ఇందులో ఓటమికి కుంగి పోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచి సాధిస్తానన్న పట్టుదల ఉండాలి. నేను సివి ల్స్‌కు నాలుగుసార్లు హాజరయ్యాను. రెండోసారి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యా. ఉద్యోగం చేస్తూనే మరోసారి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. 2018 ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు పొందాను. సివిల్స్‌లో విజేతగా నిలవాలంటే మొదట సిలబస్‌పై పట్టు సాధించాలి. ప్రధానంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివి హిస్టరీ, ఎకనామిక్స్, సైన్స్, జియోగ్రఫీ సబ్జెక్టుల్లో విలువైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సంపాదించాలి. ఇంటర్‌నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించడం, సబ్జెక్టు నిష్ణాతుల నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవడం ముఖ్యం. మెడిటేషన్, యోగా సాధన చేస్తే క్రమశిక్షణాయుత ప్రిపరేషన్ సాగించడానికి అవకాశముంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మనకు ఉండాలి.


