డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

Feb 22 2026 7:05 AM | Updated on Feb 22 2026 7:05 AM

డిప్య

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

● అదనపు ఎస్పీ చంద్రయ్య

గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రుల పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేటలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ నిర్వహించతలపెట్టారు. కానీ అనివార్య కారణాలతో పర్యటన వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు.

ఏర్పాట్లు పరిశీలన

జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పర్యటిస్తారన్న సమాచారంతో చేసిన ఏర్పాట్లను ఎస్పీ మహేశ్‌ బీ గీతే పరిశీలించారు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లు గంభీరావుపేటలో పర్యటన ఖరారైంది. కానీ చివరి నిమిషంలో అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ప్రకటించారు.

గిరిజనతండాలో మద్యపాన నిషేధం

కోనరావుపేట(వేములవాడ): తమ గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గోవిందరావుపేటతండా(బావుసాయిపేట) సర్పంచ్‌ భుక్యా తిరుపతి పేర్కొన్నారు. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు శుక్రవారం చేసిన విన్నపం మేరకు పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు శనివారం సమావేశమయ్యారు. గ్రామంలో మార్చి 1వ తేదీ నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. గోవిందరావుపేటతండా పరిధిలోని దోనబండతండా, గుగులోత్‌తండా, లౌడ్యాతండాలలో ఎవరూ మద్యం విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

వ్యాయామంతో ఆరోగ్యం, క్రమశిక్షణ

సిరిసిల్ల క్రైం: పోలీస్‌శాఖలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ అవసరమని అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ మైదానంలో శనివారం నిర్వహించి వీక్లీ పరేడ్‌ను పర్యవేక్షించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది నిత్యం అరగంటపాటు నడక, వ్యాయామం చేయాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆర్‌ఐలు, సీఐలు కృష్ణ, మధుకర్‌, యాదగిరి, రమేశ్‌, ఎస్సైలు కిరణ్‌కుమార్‌, సాయికిరణ్‌, జునైద్‌ పాల్గొన్నారు.

ఎగువమానేరుకు మల్లన్నసాగర్‌ జలాలు

గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టుకు మల్లన్నసాగర్‌ జలాలు రానున్నాయి. యాసంగి పంటలను దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్‌ జలాలు పంపించాలని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నీటి విడుదల కోసం ఆదేశాలు జారీ చేశారు. చొరవ చూపిన మహేందర్‌రెడ్డికి, మంత్రికి ఈ ప్రాంత రైతుల తరఫున కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు హమీద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా 
1
1/1

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement