రోడ్డుపైనే వంటావార్పు
ఇల్లంతకుంట(మానకొండూర్): పెద్దలింగాపూర్‌లో గత 12 రోజులుగా రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలో భాగంగా శనివారం రోడ్డుపైనే వంటావార్పు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరి ధిలోని 11/6 కాలువ పనులు పూర్తి చేయాలని డి మాండ్‌తో నిరాహార దీక్ష చేపడుతున్నారు. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు దీక్షాశిబిరంలో కూర్చున్నారు. ఆత్మకూరి అనిల్, ఎలవేని రమేశ్, కరికే నవీన్‌కుమార్, గాదె మధుసూదన్, కమటం రవి, ఎల్లోస్, పయ్యావుల బాలయ్య, వెంకటవ్వ, రాజమణి పాల్గొన్నారు.


