ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా

Jan 17 2026 7:40 AM | Updated on Jan 17 2026 7:40 AM

ఆలయ న

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా ● చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గ్రామాన్ని పాలించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది ● రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ రాష్ట్ర అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం బందంకుంటకు హద్దులు ఏర్పాటు చేయండి ● కలెక్టర్‌కు తడగొండ రైతుల వినతిపత్రం

● చొప్పదండి ఎమ్మెల్యే సత్యం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీవేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరుట్లపేటకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికిరాగా ఆయనను శ్రీవేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు బిట్కూరి నవీనాచారి, బిట్కూరి గోపాలాచారి శుక్రవారం కలిశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలనివిన్నవించారు. స్పందించిన సత్యం వెంటనే ఎండోమెంట్‌ అధికారులతో మాట్లాడారు. ఆలయ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు గుర్రాల రాజిరెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి తదితరులున్నారు.

సిరిసిల్ల అర్బన్‌: గ్రామానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాల వారికి రాజ్యాంగం ద్వారా గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే అవకాశం ఏర్పడిందని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ పేర్కొన్నారు. ఇటీవల గెలుపొందిన మాదిగ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. రగుడు వద్ద గల జీకే ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌, పూలే ఆలోచన విధానంతో సమాజాన్ని పరివర్తన చేయాలని కోరారు. మాదిగ జాగృతి సంఘం బాధ్యులు మంద బాబు, కేసుగాని దేవయ్య, పరమేశ్వరీ, మల్లయ్య, సంపతి రమేశ్‌, మహేశ్‌, శేఖర్‌, రామస్వామి పాల్గొన్నారు.

వేములవాడ: రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవశర్మపై నిట్టూరి సతీశ్‌శర్మ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ధూపదీప నైవేద్య సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గొంగళ్ల రవికుమార్‌ హెచ్చరించారు. వేములవాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడిపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రచార కార్యదర్శి చర్లపల్లి సీతారాములు, సనుగుల భాస్కర్‌, బాయి మిథున్‌శర్మ, చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, చర్లపల్లి సంతోష్‌కుమార్‌, గొంగళ్ల నాగరాజు, గొంగళ్ల మహేశ్వర్‌, దాశరథి, రాజయ్య, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): తడగొండలో సర్వే నంబర్‌ 435లోని ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, తహసీల్దార్‌ కాలె నారాయణరెడ్డిలకు వినతిపత్రం అందించినట్లు శుక్రవారం తెలిపారు. గతం నుంచి సర్వే నంబర్‌ 435లో 6.18 ఎకరాల ప్రభుత్వం భూమి ఉండేదని పేర్కొన్నారు. 2016లో అప్పటి తహసీల్దార్‌ సర్వేయర్‌తో కొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హద్దులు పాతిన ఖనీలను తొలగించి స్థానికంగా ఓ రైతు 2.20 ఎకరాల మేర స్థలం ఆక్రమించి సాగు చేసుకుంటున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. సర్వేయర్‌ ద్వారా ప్రభుత్వ భూమికి కొలతలు వే యించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకో వాలని రైతులు కోరారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో ఆర్‌ఐ మనోజ్‌ శుక్రవారం విచారణ చేపట్టా రు. సర్వేయర్‌ మధుసూధన్‌తో కలిసి రైతులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా
1
1/3

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా
2
2/3

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా
3
3/3

ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement