ఆదర్శ పాలన అందించాలి
● రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి
సిరిసిల్ల: గ్రామాల్లో ఆదర్శ పాలన అందించి, ప్రజలకు సేవ చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి కోరారు. ఇటీవల సర్పంచ్‌లుగా ఎన్నికైన రెడ్డి కులస్తులను రెడ్డి సంక్షేమ సంఘం కొత్త భవనంలో శుక్రవారం సన్మానించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్డీలు ఐక్యంగా ఉండి రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రెడ్డి కులానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు చాలా మంది గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. రెడ్డీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి సంఘానికి విరాళాలు అందించే వారికి ఆదాయ పన్నుల్లో మినహాయింపు ఉంటుందని తెలిపారు. రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, కోర్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూర్మాని లింగారెడ్డి, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, సెస్ డైరెక్టర్లు సందుపట్ల అంజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మడుపు ప్రమోదరెడ్డి, ఎగుమామిడి కృష్ణారెడ్డి, నరెడ్ల రాఘవరెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దుండ్రా జలజారెడ్డి, తిరుపతిరెడ్డి, కనకారెడ్డి, బాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, పాతూరి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


