రిజర్వేషన్లు ఖరారు!
‘బీఆర్‌ఎస్ శ్రేణులు కలిసి పనిచేయాలి. ఇంటింటికీ వెళ్లి.. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి పనులను వివరించండి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారాన్ని తెలియజేయండి. మనందరి లక్ష్యం సిరిసిల్ల మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురాలి. మీ మధ్య ఉన్న అభిప్రాయబేధాలను పక్కన పెట్టండి. సర్వే నివేదిక ఆధారంగా గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు ఇద్దాం. టిక్కెట్ రాని వారికి మరో అవకాశం కల్పిద్దాం..’ ఇవీ ఇటీవల సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో కేటీఆర్.
‘బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిద్దాం. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలి. ఎవరైనా ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తాం. సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇస్తాం. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే భవిష్యత్ ఉంటుంది. కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారని గుర్తించాలి. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని చెప్పండి’ ఇవీ ఇటీవల సిరిసిల్లలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ మాటలు.
‘అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కొత్తవారు.. పాతవారు అనే తేడాలు లేకుండా కలిసి పనిచేయాల్సిందే. వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. అభివృద్ధి మనతోనే సాధ్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించండి. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇద్దాం. అవకాశం రాని వారికి మరో పదవి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. విభేదాలకు దూరంగా ఉండాలి.’ ఇటీవల వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న
మాటలు.
రిజర్వేషన్లు ఖరారు!
రిజర్వేషన్లు ఖరారు!


