
అర్జీలు అందుకోండి.. పరిష్కారం చూపండి
● ప్రజావాణికి భారీగా తరలివచ్చిన బాధితులు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
సిరిసిల్లఅర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. అర్జీలు అందజేసి.. సమస్యలు పరిష్కరించండని విన్నవించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 206 మంది నుంచి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన సమస్యల పరిష్కారంలో శ్రద్ధ పెట్టాలని సూచించారు. పెండింగ్ పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి అర్జీలు స్వీకరించారు.