
మంత్రులూ..కనికరించరు!
ఇతను కోడం బాలకృష్ణ. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌లో ఇందిర మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. పది సాంచాలపై 12 గంటలు పనిచేస్తే వారానికి రూ.4వేల నుంచి రూ.5వేలు వస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్డర్ కావడంతో మెరుగైన కూలీ వస్తుంది. అదే పాలిస్టర్ బట్టను అవే సాంచాలపై ఉత్పత్తి చేస్తే వారానికి రూ.2వేలు వస్తాయి. అదే సొంత సాంచాలుంటే నెలకు రూ.30 నుంచి రూ.40వేలు సంపాదిస్తాడు. బాలకృష్ణ వర్కర్ నుంచి ఓనర్‌గా మారితే ఆయన దశ మారిపోనుంది.
ఇతను పెంటి తిరుపతి. మొన్నటి వరకు పాలిస్టర్ బట్ట నేస్తే నెలకు రూ.8వేల వరకు కూలి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇవ్వడంతో ఆ బట్ట నేస్తూ నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల వరకు సంపాదిస్తున్నాడు. అదే సాంచాలకు యజమాని అయితే అతనికి వచ్చే వేతనం డబుల్ అవుతుంది.

మంత్రులూ..కనికరించరు!